schedule Saturday, May 30, 2026

రేపు జరగబోయే ప్రధాని భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి

calendar_today May 9, 2026
person Prajagalam News
రేపు జరగబోయే ప్రధాని భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి
  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దింటి నవీన్ కుమార్ వికారాబాద్-: రేపు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్రమోదీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న తరుణంలో సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...12 సంవత్సరాలుగా భారత ప్రధాని గా కొనసాగుతూ,3 వ సారి ప్రధాని అయినా తరువాత హైదరాబాద్ కు మొదటి సారి విచేస్తున్నారన్నారు.వికారాబాద్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భారీ బహిరంగ సభకు తరలిరాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకారం అందిస్తుందని,రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం ఇచ్చిన నిధులే అన్నారు.గ్రామాలలో వేసే ఎన్ ఆర్ ఈ జిఎస్ సీసీ రోడ్లు మొదలుకొని నేషనల్ హై వే వరకు మొత్తం కేంద్రం నిధులు ద్వారా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాజశేఖర్,మాజీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి,మండల అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.