schedule Saturday, May 30, 2026

25లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి

calendar_today March 20, 2026
person Prajagalam News
25లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
  1. ‎25లోపు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  • వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్-: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకానికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు,ఇప్పటి వరకు రైతు భరోసా పొందని అర్హులైన రైతులు, బ్యాంకు వివరాలు నమోదు చేయని రైతులు వెంటనే యాసంగి సీజన్ కు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు.శుక్రవారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని అన్నారు.రైతు భరోసా కోసం దరఖాస్తుదారులు రైతు వేదికలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులకు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్, ఫోన్ నెంబర్ లను అందజేయాలని తెలిపారు.రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.