schedule Saturday, May 30, 2026

calendar_today May 11, 2026
person Prajagalam News
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం... పట్నం మహేందర్ రెడ్డి   ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాంమని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యం దృశ్యా ఆస్పత్రి పాలై చికిత్సలు పొందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ. లక్ష 30 వేల సీఎం ఆర్థిక సహాయ చెక్కులను పంపిణీ చేశారు. తాండూరు పట్టణానికి చెందిన రమేష్ కు 23 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు  అలాగే యలాల్ మండలం పగిడాల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ చికిత్స కొసం భర్తకు రూ. 53 ,000 చెక్కును, బషీరాబాద్  చెందిన ఆశా బేగం కుటుంబ సభ్యులకు రూ. 54,000 చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాడు. అలాగే చేవెళ్ల లోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ లో పేదలకు ఉచిత వైద్యం చేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహేందర్ రెడ్డి సూచించారు.