schedule Friday, July 31, 2026

గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి

calendar_today March 20, 2026
person Prajagalam News
గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి
    వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు    వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల):గిరిజన తండా గ్రామపంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల పరిధిలోని బండమీది తండా గ్రామ పంచాయతీలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 5లక్షల రూపాయల నిధులతో వేస్తున్న సిసి రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ దివ్య శంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన గ్రామల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మాజీ ఎంపిటిసి సిహెచ్ ఆనందం,పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్,పీరంపల్లి రమేష్,కె. నరహరి,ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గిరిజన తండా వాసులు పాల్గొన్నారు.