కరణం ప్రహ్లద్ రావు పుట్టినరోజు సందర్బంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
June 6, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, ముజాహిద్ పూర్ గ్రామ కార్యకర్తలు,అభిమానులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పూలగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించే సంప్రదాయానికి భిన్నంగా, పేద విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, విద్యా సామగ్రిని అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రహ్లాదన్న సేవా దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ జన్మదిన వేడుకలను సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనుకున్నామని, విద్యార్థులకు చదువులో తోడ్పాటునందించడం కంటే గొప్ప బహుమతి మరొకటి ఉండదని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
ఈ వినూత్న కార్యక్రమంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. సమాజ హితం కోరే ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కమ్మరి మోనాచారి, బిచ్చన్న, రాతికింది రాజు, ప్రధాన కార్యదర్శి పోమాల నరేష్, మనోహర్,మల్లేష్, ప్రశాంత్, శివ,రాము,లక్ష్మణ్,శ్రీకాంత్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.