schedule Friday, July 31, 2026

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను గిరిజన యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి..:- అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్

calendar_today June 9, 2026
person Prajagalam News
నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను గిరిజన యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి..:-  అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
(ప్రజాగళం,కుల్కచర్ల)   గిరిజన యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ (లోకల్ బాడీ)పేర్కొన్నారు.మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ నగరంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోసం గిరిజన యువతి యువకులు బయలుదేరారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ (లోకల్ బాడీ) మాట్లాడుతూ గిరిజన యువకులు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రస్తుతం మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్ శిక్షణ, ఎలక్ట్రికల్, టైలరింగ్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో 3 నెలల శిక్షణలో రాణించాలన్నారు. గిరిజన యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆసక్తి గల వారు సంబంధిత అధికారులను ఫోన్ నెంబర్ 8464006666 @9959293604లో సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిటిడిఓ కమలాకర్ రెడ్డి, నైపుణ్య శిక్షణ నిర్వాహకులు,కుల్కచర్ల మండల ఇన్చార్జి రాథోడ్ రాజేందర్ నాయక్,గిరిజన యువతి, యువకులు పాల్గొన్నారు.