schedule Friday, July 31, 2026

సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి :- కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

calendar_today June 9, 2026
person Prajagalam News
సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి  :-   కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
(ప్రజాగళం,కుల్కచర్ల)   వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా,వైరల్ జ్వరాలు,అతిసారం వంటి సీసనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలని కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ సూచించారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో కుల్కచర్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డా. కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం "డ్రై డే ఫ్రైడే" కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి, ఇళ్ల పరిసరాల్లో నిల్వ నీరు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. గ్రామాలు, కాలనీల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సూచనలు అందించాలని, జ్వరాలు లేదా ఇతర లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంఎల్. హెచ్‌పీలు డా. మాధురి, అరుణ,హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.