ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణాన్ని కాపాడండి... చైర్ పర్సన్ నీరజ
calendar_today
June 10, 2026
person
Prajagalam News
• దశల వారీగా వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి
• వార్డు సమావేశంలో పోలీసుల అవగాహన అభినందనీయం.... మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి
(తాండూర్)
వార్డు సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ప్లాస్టిక్ ను నివారించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో 27 వ వార్డు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా వార్డ్ కౌన్సిలర్ స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో వార్డు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు పట్టణ జనాభాకు సరిపడా పారిశుద్ధ సిబ్బంది లేకున్నా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్యనికి పెద్ద పీఠ వేస్తున్నామని అన్నారు. 27వ వార్డులో ప్రజలు మంచినీటి సమస్య ఉందని దృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే బోరు వేస్తామని అన్నారు. ప్రజలు తమ ఇంటితోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ ను పూర్తిగా త్యజించి సంచులను వాడాలని అన్నారు. ప్లాస్టిక్ వల్లే అనేక రోగాలు వ్యాపిస్తున్నాయని ప్లాస్టిక్ ను నివారించాలని కోరారు. వార్డ్ జవాన్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని వార్డు జవాన్ ను ఆదేశించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు కౌన్సిలర్ స్వరూప మల్లేశంతో కలిసి చీరలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్రెడ్డి, కానిస్టేబుల్ సాయప్ప, ఆర్ పి సుజాత మున్సిపల్ జవాన్, సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.