చర్చకు సిద్ధమా కేటీఆర్
June 30, 2026
Prajagalam News
-:స్పీకర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించం
:-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్
- వికారాబాద్- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని,బీఆర్ఎస్ పాలన కాలం ముగిసే సమయంలో జి.ఓలు ఇచ్చి ఫైనాన్స్ క్లియరెన్స్ చేయలేదని,బీఆర్ఎస్ జి.ఓ లు ఇచ్చి పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారసింగ్ అన్నారు.కేటీఆర్ ఎస్ ఐ ఆర్ కార్యకర్తల సమావేశం వికారాబాద్ లో నిర్వహించి ,సీఎం రేవంత్ రెడ్డి,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ,ప్రభుత్వం పై విమర్శలు చేయడం తగదన్నారు.కేటీఆర్ కు రాష్ట్రంలో అమలు అవుతున్న 6 గ్యారెంటీలు కళ్ళకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కేటీఆర్ దృతరాష్ట్రుడితో పోల్చడం బాధాకరమని, స్పీకర్ ను అన్ని పార్టీల వారు,దేశంలోనే బెస్ట్ స్పీకర్ గా గుర్తించిన కేటీఆర్ కు వినిపించడం లేదా అని అన్నారు. ఎమ్మెల్యే లు పార్టీల ఫిరాయింపు కార్యక్రమంకు శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కదా అని ధారసింగ్ ప్రశ్నించారు.కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుల్లు కుంటున్నారని ఆయన అన్నారు.రాష్ట్రంలో 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాన్ని చూపించగలరా అని సవాళ్లు విసిరారు.బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి పోయారని,అప్పులను కడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విజయవంతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని తెలిపారు.