schedule Wednesday, July 29, 2026

ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎమ్మార్వో

calendar_today July 3, 2026
person Prajagalam News
ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎమ్మార్వో
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల మండల పరిధిలో ఎక్మైయి,మైల్వార్,కంసాన్ పల్లి గ్రామలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బషీరాబాద్ తహశీల్దార్ షాహేద్ బేగం శుక్రవారం నాడు హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంలో తహశీల్దార్ షాహేద్ బేగం మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి,బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లాలి,కొత్త ఓటర్ల నమోదు,మరణించిన వారినీ తొలగింపు,తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్.ఐ నాగార్జున రెడ్డి,బిఎల్ఓ,తదితరులు పాల్గొన్నారు.