schedule Wednesday, July 29, 2026

ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

calendar_today July 8, 2026
person Prajagalam News
ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

• రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ దే

• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

( తాండూర్)

స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు పట్టణ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని రాజీవ్–ఇందిరమ్మ కాలనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత నేత వైఎస్సార్ కి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ హయంలో అనేక సంక్షేమ పథకాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నిలిచారని అన్నారు. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేటి పాలకులకు ఆదర్శమని అన్నారు. ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత అని కొనియాడారు.పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు  ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అనంతరం రైతు ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.6,000 పంట పెట్టుబడి సాయం జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి పాలాభిషేకం చేసి తాండూరు రైతుల తరుపున ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, పట్టణ అధ్యక్షులు నాగరాజు తోపాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జులు, పలువురు సీనియర్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.