ఎన్యుమరేషన్ ఫారాలను నింపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి :- కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్
July 15, 2026
Prajagalam News
కుల్కచర్ల,జూలై 14(ప్రజాగళం)
ఎన్యుమరేషన్ ఫారాలను నింపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ నాయక్ తెలిపారు. కుల్కచర్ల మండల కేంద్రంలో సర్పంచులు, వార్డు సభ్యులు, బీఎల్ఓలకు సర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల కమీషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఓటరు నమోదు, తొలగింపు, సవరణలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలలో తమ కుటుంబ వివరాలను జాగ్రత్తగా నింపి బీఎల్ఓలకు అందించాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేయకుంటే ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వెంకటయ్య, రవీందర్, నాయకులు జంగయ్య, జలీల్, కుల్కచర్ల వార్డు సభ్యులు వెంకటేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.