schedule Wednesday, July 29, 2026

కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కని గౌరవం,పదవులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవి రాజ వర్ధన్ రెడ్డికి అప్పగిస్తే,కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

calendar_today July 17, 2026
person Prajagalam News
కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కని గౌరవం,పదవులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవి రాజ వర్ధన్ రెడ్డికి అప్పగిస్తే,కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాము నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పదవులు రాజ వర్ధన్ రెడ్డికి కట్టబెడితే పార్టీ పరంగా సమావేశాలకు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. అదేవిధంగా మండల పరిధిలో లంబాడి సోదరుల జనాభా ఎక్కువగా ఉన్నది. పిఎసిఎస్ చైర్మన్ పదవి ఈసారి మాకు ఇవ్వాలని కోరారు.అనుభవమున్న వ్యక్తులు ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేశాము, 70 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేసి బిల్లులు రాకపోయినా ఎన్నో బాధలు ఎదుర్కొన్నాము.మార్కెట్ కమిటీ పదవులు,మండల అధ్యక్షుని పదవులు చేసిన అనుభవమున్న వ్యక్తులమని,ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీలకు పిఎసిఎస్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు ఈసారైనా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాలాంటి వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కలాల్ నర్సిములు గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మన్ రావు,సత్యం,నరేష్ చావన్,కృష్ణ గౌడ్,శ్రీనివాస్, కె.వీరేశం,తదితరులు పాల్గొన్నారు.