విద్యార్థి తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం.తెలుగు పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థుల అవస్థలు ఇంకెన్నాళ్లు తల్లిదండ్రుల ఆవేదన.ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి హాజరు
July 18, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పీఎంశ్రీ పాఠశాలలో శనివారం నాడు విద్యార్థుల తల్లిదండ్రులతో, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి దూస రాములు హాజరయ్యారు. ఈ సందర్భంలో విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తెలుగు పాఠంశం బోధించే ఉపాధ్యాయులు లేరని, మాతృభాష బోధించే గురువు లేక తెలుగు పాఠ్యాంశంలో గత సంవత్సరం మార్కులు తక్కువగా వచ్చాయని, తెలుగు పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది.ఈ అంశంపై మండల విద్యాధికారి డి. రాములు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సానుకూలంగా స్పందించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాతృభాష బోధించే గురువును ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ విజీత,ఎస్సీ హాస్టల్ వార్డెన్ రాధిక, ఉపాధ్యాయులు ఆర్.శ్రావణి,కవిత, జామున,అమృతరాణి,స్వరూప, లక్ష్మీబాయి,పి.టి గంగన్న,విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.