schedule Wednesday, July 29, 2026

స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం.....మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్. 

calendar_today July 20, 2026
person Prajagalam News
స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం.....మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్. 
సంస్థ సేవలు అభినందనీయమని పరిగి మున్సిపల్ చైర్ పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ అన్నారు. అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కిష్టమ్మ గుడి తండా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక ఎం ఈ ఓ అంజయ్య, సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ లతో కలిసి కిట్స్ ( బ్యాగులు, మ్యాట్లు , చెప్పులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంకిత సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కిట్స్ లు ఇవ్వడం చాలా సంతోషం అన్నారు. బ్యాగులు మ్యాట్లు చెప్పులు బాగున్నాయని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం అందజేస్తుందని అదేవిధంగా విద్యార్థులకు బట్టలు ,షూలు తో పాటు పుస్తకాలు నోటుబుక్కులు ఇతర సామాగ్రిని కూడా అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ .. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను గుర్తించి విద్యకు ప్రోత్సాహంగా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం చాలా సంతోషమని ఆయన అన్నారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ పవర్, పాఠశాల చైర్మన్ వీరమని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బాలయ్య, టిఆర్ఎస్ నాయకులు సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.