schedule Wednesday, July 29, 2026

భర్త మృతి తర్వాత భూ వివాదం

calendar_today July 24, 2026
person Prajagalam News
భర్త మృతి తర్వాత భూ వివాదం
  -జిల్లా కలెక్టర్‌కు మహిళ ఫిర్యాదు.
  • వికారాబాద్:- వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రానికి చెందిన అమైన్ బేగం తన భర్త మృతి అనంతరం తలెత్తిన భూ వివాదంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె గురువారం మీడియాకు వెల్లడించారు. అమైన్ బేగం తెలిపిన వివరాల ప్రకారం.. ధారూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 3,106లో ఉన్న భూమిని తాను, తన భర్త కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, తన భర్త మరణించిన తర్వాత పిల్లల పోషణ, వారి చదువులు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అదే భూమిని ధారూర్‌కు చెందిన అక్తార్ అనే వ్యక్తికి విక్రయించినట్లు చెప్పారు.భూమి విక్రయించిన అనంతరం తన భర్త కుటుంబ సభ్యులు ఆ భూమిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు అవసరమైన అనుమతులు ఇచ్చినప్పటికీ, భూమి విషయంలో వివాదం సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూ కబ్జాకు సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు అమైన్ బేగం తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.