schedule Saturday, August 01, 2026

ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలి

calendar_today July 31, 2026
person Prajagalam News
ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్లు అందరూ భాగస్వాములు కావాలి
వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ చామల రఘుపతి రెడ్డి వికారాబాద్-:‏ వికారాబాద్ నియోజకవర్గంలోని 284 పోలింగ్ బూతులకు గాను 100శాతం ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని వికారాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ చామల రఘుపతి రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.వికారాబాద్ నియోజకవర్గములోని మండలాల వారీగా ఎస్ ఐ ఆర్ వివరాలు మర్పల్లి 79.03 శాతం, మోమిన్ పేట్ 77.40శాతం,వికారాబాద్ 85.65శాతం వికారాబాద్ టౌన్ 64.96శాతం,ధరూర్ 82.60శాతం, కోటపల్లి 81.54శాతం, బంట్వరం 81.45 శాతంగా పూర్తి అయిందని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియమించిన బిఎల్ఏ లు ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో చురుకుగా పాల్గొని ఓటర్లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తున్నారని అన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారంలు ఇవ్వని ఓటర్ లు ఎవరైనా ఉంటే వెంటనే బిఎల్ఓ కు అందించాలని, దేశంలో నివసించే ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. అది మనందరి బాధ్యత.మరియు ఆగస్టు 3 వ తేదీ లోపు ఎస్ ఐ ఆర్ లో నమోదు చేసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్ ఐ ఆర్ సూపర్వైజర్లు, బిఎల్ఏ లు ప్రత్యేక శ్రద్ద వహించి కార్యక్రమన్ని విజయవంతం చేయాలని కోరారు.‎