ఆయన ఒక దివ్యాంగుడు.
ఆయనకు రెండు కాళ్ళు ఉండవు.కానీ ఆయన మనోధైర్యంతో బ్రతకాలని అనుకోని ఒక టెంట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాడు.గ్రామంలో వచ్చే చిన్న చిన్న ఆర్డర్లతో వచ్చే కొద్దిపాటి సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు.ఎలాగైనా బ్రతగలనే ఆయన సంకల్పాన్ని విధి చిన్న చూపు చూసింది.బ్రతుకు దేరువుకు ఉన్న టెంట్ హౌస్ అగ్నికి ఆహుతై పోయింది.వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ మండలం ఫుల్ మద్ది గ్రామానికి చెందిన శామయ్య(35)
దివ్యాంగుడు. 15 ఏళ్లుగా గ్రామంలో టెంట్ హౌస్ నడుపుతున్నారు.మంగళవారం ఫుల్ మద్ది గ్రామంలో బిరప్ప జాతర జరిగింది.దానికి కూడా ఆయన టెంట్ హౌస్ నుంచే టెంట్లు వేశారు.జాతర కోసం అని నూతనంగా ఆయన ఆర్థిక స్థోమతకు మించి టెంట్లు కొన్నాడు. జాతర అయిపోయాక టెంట్ హౌస్ (షాప్)లో అన్ని టెంట్లు,మైక్ సెట్లు ఇతర సామగ్రీ పెట్టి ఇంటికి సమయంలో వెళ్లారు.అర్ధరాత్రి సమయంలో ఒక సరిగా మంటలు చెలరేగాయి.గ్రామస్తులు ,ఫైర్ సిబ్బంది వచ్చే లోగా అంతా బూడిద అయ్యింది.ఎవరైనా నిప్పు పెట్టారా? లేదా కరెంట్ షార్ట్ సర్కూట్ వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.దాదాపు గా షాప్ లో బూడిద పాలు అయిన రూ.8 లక్షల వరకు నష్టం జరిగిందని శామయ్య కన్నీరుమున్నీరు అయ్యారు.ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.