schedule Friday, July 31, 2026

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ముజాహిద్స పూర్ సర్పంచ్ చంద్రభూపాల్

calendar_today March 25, 2026
person Prajagalam News
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ముజాహిద్స పూర్ సర్పంచ్ చంద్రభూపాల్
గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను 30సంవత్సరాలు పైబడిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ చంద్రభూపాల్,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు. కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామ పంచాయతీలో బుధవారం కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కిరణ్ గౌడ్, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో 30సంవత్సరాలు పైబడిన వారికి వైద్య సిబ్బంది బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు