బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలను తెరలేపుతున్నారు.... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప
March 26, 2026
Prajagalam News
తాండూర్: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషితో ఈ ఆర్థిక సంవత్సరంలో తాండూర్ నియోజకవర్గానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు రూ.25 కోట్ల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాలకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, బ్రిడ్జి పనులు వేగంగా ప్రారంభమై ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.కొంతమంది నాయకులు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తరలింపు జరుగుతుందని చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.గతంలోలా కాకుండా ప్రస్తుతం రెవెన్యూ అధికారుల అనుమతితో ప్రభుత్వ పనుల కోసం మాత్రమే ఇసుక తరలింపు జరుగుతోందని స్పష్టం చేశారు..ముఖ్యంగా కోట్‌పల్లి ప్రాజెక్ట్, చించోళి ప్రధాన రహదారుల పనుల కోసం మాత్రమే ఇసుక వినియోగిస్తున్నామని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు లేకుండా పనులు జరిపిన వారు ఇప్పుడు అభివృద్ధిని చూడలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించలేదనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. సిరిగిరిపేట్‌కు రూ.17 లక్షలు, మిట్టబాస్పల్లికి రూ.7.5 లక్షలు, జీన్గుర్తికి రూ.8 లక్షలు ప్రహారీ గోడలు, సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు అదే విధంగా తాండూర్ మండలంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 63 పనులకు గాను దాదాపు రూ. 4.30 కోట్లు అభివృద్ధి పనులు గ్రామాలలో జరుగుతున్నాయని, మార్చి నెలాఖరుకు పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, తాండూర్ మండలంలో బెల్కటూర్ బ్రిడ్జి, బొంకూర్ బ్రిడ్జి, కరణ్‌కోట్ రోడ్, సిరిగిరిపేట్–అల్లాపూర్ రోడ్‌తో పాటు రాంపూర్ కింది తండా, మీది తండా ప్రాంతాల్లో కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు... ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.