schedule Friday, July 31, 2026

కాళాపూర్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 

calendar_today March 26, 2026
person Prajagalam News
వికారాబాద్ (పరిగి):పరిగి మండలం కాళాపూర్, రాపోల్ గ్రామాల్లో ప్రతిపాదిత భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, గ్రామస్తులు నేడు ఆందోళన చేపట్టారు. అభివృద్ధి పేరుతో 1200 ఎకరాల పంట భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య మాట్లాడుతూ, కాళాపూర్ గ్రామంలో పేద రైతులకు జీవనాధారమైన పంట భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో బలవంతంగా తీసుకోవడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. ఈ భూములు కోల్పోతే రైతు కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయని, జీవనోపాధి కోల్పోతారని అన్నారు,సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ నిర్వహించకుండా భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాగే, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు.తక్షణమే భూసేకరణను నీలిపి వేయాలని అన్నారు ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులు కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో వెంకటయ్య,హబీబ్ సిపిఎం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు