schedule Saturday, August 01, 2026

బెట్టింగ్ నిర్మూలిద్దం యువతను కాపాడుకుందాం:కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్

calendar_today March 28, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల) :నేటి నుండి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎంతో మంది యువకులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఐపీఎల్ ని కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలని అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్ పాల్పడి, డబ్బులు కోల్పోయాక నేరాల వైపు చూస్తున్నట్టు తెలుస్తుందని ఇది జీవితాన్ని నాశనం చేస్తుందని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ హెచ్చరించారు. చిన్నగా ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంగా మారి బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునే దాకా వెళుతుంది కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లలు ఆన్లైన్లో క్రికెట్ చూస్తున్న,బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న మీరు గమనిస్తూ ఉండాలని ఎవరైనా బెట్టింగ్ పాల్పడి నట్టు మీకు సమాచారం ఉంటే దయచేసి 87126 70044 నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం మేము రెడీగా ఉన్నామని తెలిపారు