schedule Saturday, August 01, 2026

కుల్కచర్ల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.

calendar_today March 28, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం
కుల్కచర్ల మండల తహసిల్దార్ కార్యాలయంలో సిసి రోడ్డు పనులను డిసిసి ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ స్థానిక సర్పంచ్ వార్వాల అంజిలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం తమ లక్ష్యమని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం ద్వారా కార్యాలయానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కలుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించి అభివృద్ధికి భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కనకం మొగులయ్య, మాజీ అధ్యక్షుడు వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య రాంపూర్ సర్పంచ్ చెక్కల తిరుపతయ్య, బండవెల్కిచర్ల సర్పంచ్ శ్రీనయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ రెడ్డి, రామచంద్రనాయక్, రామచంద్రయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.