వికాసిత్ భారత్ లక్ష్య సాధనలో మోడీకి తోడుగా నిలవాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి:- బిజెపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు
March 30, 2026
Prajagalam News
వికసిత భారత ప్రయాణంలో నరేంద్ర మోదీ సంకల్పానికి తోడుగా సామాజిక మాధ్యమాల ద్వారా మనమందరం తోడుగా నిలిచి దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని బిజేపి వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు పేర్కొన్నారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమంలో భాగంగా కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హాల్ లో బిజేపి కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల.వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిగి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల,చౌడాపూర్, దోమ మండలాల శిక్షణ తరగతుల్లో
ముఖ్య అథితిగా హాజరై దిశా నిర్దేశం చేశారు.
బిజేపి శిక్షణ తరగతుల్లో
పంచ పరివార్తనాలు, ఏఐ అంశంపై యు.రమేష్ కుమార్,
బిజెపి చరిత్ర - వికాసంపై మాధవరెడ్డి,
మన కార్య పద్ధతిపై శివరాజ్ ,మన దృష్టిలో కార్య విస్తరణ అంశంపై విజయ భాస్కర్ రెడ్డి పాల్గొని గురించి ప్రసంగించడం జరిగింది.
కార్యకర్తలను ప్రతి అంశంలో సుశిక్తులైన సైనికులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఎంతో కీలకమైనవని,కార్యకర్తలు అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి యోజనలను ప్రచారం చేయడానికి సామాజిక మాధ్యమాలను బలంగా వినియోగించాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు ప్రచారాలు ఖండిస్తూనే పార్టీ యొక్క స్పష్టమైన విధానాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు.అదే విధంగా ఏఐ వినియోగం పట్ల ప్రతి కార్యకర్త తర్ఫీదు పొందడం చాలా కీలకం. సామాజిక మాధ్యమాల్లో సాంకేతికతను ఉపయోగించడం నుండి మొదలుకొని ఏఐ ఉపయోగించి ప్రతిపక్షాలు చేస్తున్న అసంబద్ధ వాదనలను ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబెర్ ఘణాపురం వెంకటయ్య గౌడ్, దిశా కమిటీ మెంబర్ జానకి రాం, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కాటన్ పల్లి అంజిలయ్య,జిల్లా ఉపాధ్యక్షులు మ్యాకల యాదయ్య,జి.కేశవులు,జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్,చాకలి.బంధ్యయ్య, జెమినీ సురేష్, చౌడపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, దోమ అధ్యక్షుడు మల్లేష్, సీనియర్ నాయకులు వీరారెడ్డి,మల్లికార్జున్, హరికృష్ణ,కృష్ణారెడ్డి,చంద్రలింగం,కర్ణయ్య, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శులు వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.