schedule Saturday, August 01, 2026

పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి విరాళం అందజేత - 95తులాల వెండి వినాయక తొడుగును,50కేజీల ఇత్తడి గంట బహుకరించిన దాతలు

calendar_today March 31, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల)ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వినాయక వెండి తొడుగు,ఇత్తడి గంటను దాతలు విరాళంగా ఆలయ పూజారులకు అందజేశారు. మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న వినాయక విగ్రహానికి షాద్ నగర్ కు చెందిన శాలిని అమర్నాథ్ దంపతులు 95తులాల వెండి తొడుగును ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి విగ్రహానికి అలంకరించారు. అదే విధంగా అంతారం గ్రామనికి చెందిన బాసుపల్లి శాంతిరెడ్డి దంపతులు 50కిలోల ఇత్తడి గంటను బహుకరించారు. ఈ సందర్బంగా ఆలయ పూజారులు వారిని, కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పాండుశర్మ, దశరథం తదితరులు పాల్గొన్నారు