schedule Friday, July 31, 2026

సీఎం సహాయ నిధి పేదలకు కొండంత భరోసా

calendar_today April 1, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని,వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నదని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు అన్నారు.బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి కార్పొరేట్‌ వైద్యంతో స్వస్థత పొందేందుకు ఎంతగానో దోహదపడుతున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటిసి సిహెచ్ ఆనందం, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య గౌడ్,జిల్లా యువ నాయకుడు కుమ్మరి స్వామి,వార్డు సభ్యుడు మోత్కూర్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం సహాయనిధి లబ్ధిదారులు పాల్గొన్నారు