schedule Friday, July 31, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామసభలు లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్

calendar_today April 2, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల):- ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పారదర్శకంగా అమలు చేయడం, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా గ్రామసభను నిర్వహించడం జరుగుతుందని లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు.గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండా గ్రామపంచాయతీ లో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, అదే విధంగా వివిధ సంక్షేమ పథకాలకు కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావుడ్య బుజ్జి, పంచాయతీ కార్యదర్శి శారద, మహిళ సంఘాల సిసి వెంకట నరసింహులు, ప్రాథమిక పాఠశాల చైర్మన్ శాంతమ్మ, వివో ఏ చెన్నమ్మ, వార్డు సభ్యులు శివమ్మ, చంప్లి బాయి, తాండవాసులు శంకర్ నాయక్, రవి నాయక్, వచానాయక్, నీల్యా నాయక్, లక్ష్మణ్ నాయక్, గోపాల్ నాయక్, రామచందర్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.