schedule Saturday, May 30, 2026

కాలాపూర్,రాపోల్ రైతులకు అండగా ఉంటాం :- చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

calendar_today April 6, 2026
person Prajagalam News
కాలాపూర్,రాపోల్ రైతులకు అండగా ఉంటాం :-  చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి 
వికారాబాద్ జిల్లా (పరిగి)
పంట పొలాలు నాశనం చేసి కేవలం బీడుమూలుగా మార్చేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని, భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుందని చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని  కాలాపూర్,రాపోల్ గ్రామాలలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క పట్టా భూములను అసైన్ ల్యాండ్లను తీసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందో దీనిని వ్యతిరేకిస్తూ అక్కడ రైతులు వారి వారి గ్రామాలలో నిరసన వ్యక్తం చేస్తున్న వారికి మద్దతుగా చేవేళ్ళ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అక్కడికి వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడారు.ఇది కచ్చితంగా ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని రైతుల యొక్క అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క నూతనంగా తీసుకువచ్చిన వంటి ల్యాండ్ ఆక్వేషన్ ఆక్ట్ ప్రకారం కాకుండా రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ల్యాండ్ అక్వేషన్స్ ముమ్మాటికి తప్పు . సరైనటువంటి పద్ధతిలో రైతులను ఒప్పించి వారి యొక్క అనుమతి ద్వారానే భూములను తీసుకోవాలని సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఎన్నో ఉన్నాయని కచ్చితంగా 80 శాతం రైతులు వారి యొక్క పొలాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అభివృద్ధి కోసం ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని ప్రభుత్వాలు తీసుకొని వివిధ పారిశ్రామికంగా వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని కానీ ఇలాంటి అనైతికమైనటువంటి రైతులను బజారున ప్రక్రియను ప్రభుత్వం వెంటనే సమీక్షించి అఖిల పక్షాన్ని పిలిచి వారి సమక్షంలో రైతులకు జరిగే మేలును వివరించి వారిని ఒప్పించే ప్రయత్నం చేసే విధంగా చట్టాలు తేవాలని అప్పుడే రైతులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. రైతుల యొక్క పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుందని వారికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రక్రియను రద్దు చేసే విధంగా పోరాటం చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ప్రహ్లాద్ రావు,ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప,మారుతి కిరణ్ భూనేటి,మిట్ట పరమేశ్వర్ రెడ్డి,ఘనాపూర్  వెంకటయ్య,బండలింటి రామచందర్,బాలకృష్ణ రెడ్డి,అనసూయ, జిల్లా పదాధికారులు,మండల నాయకులు, తదితర బిజెపి పెద్దలు కార్యకర్తలు గ్రామ ప్రజలు రైతులు అందరు పాల్గొన్నారు .