schedule Friday, July 31, 2026

ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా...ఇదేనా ప్రజాపాలన... ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం

calendar_today April 7, 2026
person Prajagalam News
ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా...ఇదేనా ప్రజాపాలన...     ప్రతిపక్షాలను అణిచివేయాలని చూడటం అప్రజాస్వామికం
వికారాబాద్ (దోమ):- వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కళ్లాపూర్, రాపోల్ గ్రామలలోని రైతుల నుండి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరిట బలవంతంగా భూములను గుంజుకోవడం సమంజసం కాదని దోమ మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు కే.రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపిపి మల్లేశం అన్నారు.మంగళవారం రైతులను పరామర్శించడానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు రానున్న దృష్ట్యా అక్కడికి వెళ్లకుండా దోమ మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందించడం ప్రభుత్వం పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు.ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం వదిలి ప్రజలను,రైతులను ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు.ప్రజలలో తిరుగుబాటు వస్తే ఈ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం కావున రైతులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను,సంక్షేమ పథకాలను అమలు పరచాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాల్ గౌడ్, కో అప్షన్ మాజీ సభ్యుడు ఖాజాపాష,కోసునం శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ సభ్యులు మైనొద్దీన్,సాజిద్,సలీమ్,కొండయ పల్లి సర్పంచ్ వెంకటయ్య,రైతులు శ్రీనివాస్,కావాలి ఆశప్ప, ఆశన్న,నాయకులు తదితరులు పాల్గొన్నారు.