schedule Saturday, May 30, 2026

ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేసేందుకు ఇంటింటికి సీపీఐ వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటేష్

calendar_today April 10, 2026
person Prajagalam News
ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేసేందుకు ఇంటింటికి సీపీఐ  వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటేష్
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మిట్ట కోడూరు గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు దాటిందని గుర్తు చేశారు. దేశాన్ని కార్పోరేట్ శక్తుల నుంచి విముక్తి చేసి సమ సమాజ స్థాపనకు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఐ పార్టీ  అని అన్నారు. భవిష్యత్తులో ప్రజా పోరాటాలు మరింత బలోపేతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న నేటికీ ప్రజా సమస్యలు నిరుద్యోగం అంటరానితనం అవమానాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఖనిజ సంపదను కొల్లగొట్టి బడ వ్యాపారస్థుల చేతిలో పెట్టేందుకు మాత్రమే పనిచేస్తుంది అన్నారు. దేశంలో పెరుగుతున్న నిత్యవసర ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలన్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు పెన్షన్ తక్షణమే అమల్లోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని రాబోయే రోజులలో సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తామని ప్రజల యొక్క గొంతుకగా ప్రభుత్వాలను నిలదీస్తామని ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా ఎర్రజెండా పోరాడుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామచంద్రయ్య, నర్సింహులు,వెంకటయ్య ,    సాయిలు,శ్రీనివాస్, పెంటమ్మ  బాలమ్మ,తదితరులు పాల్గొన్నారు.