హిందూ సమ్మేళన పోస్టర్‌ను ఆవిష్కరించిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి
April 14, 2026
Prajagalam News
(పరిగి):-పరిగి పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 19న నిర్వహించనున్న హిందూ సమ్మేళన పోస్టర్‌ను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిగి పట్టణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం ఆనందకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతను పెంపొందించే దిశగా ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి పరిగి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.