పారిశుధ్య కార్మికుల సేవలు అముల్యమైనవి కుల్కచర్లలో బిజేపి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఘనసన్మానం వికారాబాద్ జిల్లా బిజేపి కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు
April 15, 2026
Prajagalam News

(కుల్కచర్ల):- పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని వికారాబాద్ జిల్లా బిజేపి కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు కొనియాడారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యలయంలో మండల పార్టీ అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంధర్ రావు సూచన మేరకు కుల్కచర్ల గ్రామపంచాయతీ కార్మికులు,సిబ్బందిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య,చాపల గూడెం సర్పంచ్ స్వప్న గోపాల్, స్థానిక మాజీ సర్పంచులు మహిళ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సౌమ్య రెడ్డి, దిశా కమిటీ మెంబర్ జానకిరామ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ,జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్ ముదిరాజ్,స్థానిక ఉప సర్పంచ్ తలారి విజయ్ కుమార్,చాపలగూడెం ఉపసర్పంచ్ గండి అంజమ్మ సిద్దయ్య, సీనియర్ నాయకులు సిహెచ్ చంద్రలింగం,దళిత మోర్చా నాయకులు బెందురు అంజిలయ్య, వార్డు సభ్యులు రాధిక రామస్వామి,గొల్ల ఉదయ్,పింకీ అనిల్,పగిడాల రాములు, లింగంపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
.