ఫ్రెండ్లీ పోలీసింగ్..వేసవిలో ప్రజలకు రాగిజావ పంపిణీ:- మానవత్వం చాటిన కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి
calendar_today
April 17, 2026
person
Prajagalam News
(కుల్కచర్ల)
వేసవిలో రాగి జావ తాగితే ఆరోగ్యంగా ఉంటారని,వడదెబ్బ తగలకుండా ఉండటానికి, అలాగే శరీరాన్ని చల్లబరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి వేసవిలో ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులకు,ప్రజలకు రాగిజావా అందించడం అభినందనీయం అని అన్నారు.ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరు సేవాభావంతో గ్రామల్లో ప్రజలకు, ప్రయాణికులకు వేసవిలో ఇబ్బంది కలగకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేసేలా చోరవ తీసుకోవాలని సూచించారు.