రైతుల కుటుంబాలకు అండగా ఉంటాం కుల్కచర్ల పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కొండయ్య గౌడ్
April 17, 2026
Prajagalam News
(కుల్కచర్ల)
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న రైతులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు అండగా ఉంటామని కుల్కచర్ల పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కొండయ్య గౌడ్ అన్నారు.వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామానికి చెందిన రంగి వెంకటయ్య అనే రైతు మరణించడం జరిగింది.శుక్రవారం పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కొండయ్య గౌడ్ వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం రంగి వెంకటయ్యకు కుల్కచర్ల సొసైటీ (పిఎసిఎస్) లో సభ్యత్వం ఉండటంతో 9వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని భార్య మల్లమ్మ అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లేగల చిన్న రాములు,రంగి కృష్ణయ్య,శ్రీనివాస్, ప్రభాకర్,గడుసు.మహిపాల్, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.