ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలి బండమీదితండా సర్పంచ్ దివ్య శంకర్
April 17, 2026
Prajagalam News
(కుల్కచర్ల)
ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సర్పంచ్ దివ్య శంకర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండమీదితండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రలచ్చ తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దేవసింగ్,ఉప సర్పంచ్ చాపల మహేష్, వార్డు సభ్యూరాలు దానమ్మ, అంగన్వాడీ టీచర్,గిరిజన తండా వాసులు, చిన్నారులు పాల్గొన్నారు.