schedule Saturday, May 30, 2026

ప్రజా పాలన అంటే ఇదేనా...!

calendar_today April 18, 2026
person Prajagalam News
ప్రజా పాలన అంటే ఇదేనా...!
 

* ఫుట్ పాత్ పై బతికే ప్రజల డబ్బాలను పగలగొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు.... సిపిఎం శ్రీనివాస్

(తాండూర్) తాండూరు పట్టణంలో ఉన్న పేద ప్రజలు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను పగలగొట్టడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ అన్నారు.ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి పేద ప్రజల కడుపులు కొట్టడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక నాయకులు ఫుట్ పాత్ పై బతికే ప్రజలపై రాక్షస పాలన కొనసాగిస్తూ అక్రమంగా దౌర్జన్యంగా పేద ప్రజల డబ్బాలను తొలగిస్తూ ప్రజాపాలనని పేరుకు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పట్టణంలో నడిబొడ్డున అనేక ప్రభుత్వ భూములను భూ కబ్జాదారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పేద ప్రజలపై వేధింపులు చేయడం అక్రమంగా దౌర్జన్యంగా పేదల డబ్బాలను కూల్చి వేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ నాళాలని కుంటలని చెరువులని కబ్జాలు చేసుకొని అక్రమ ఇంటి నిర్మాణాలు చేస్తున్న వారి పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే స్థానిక చైర్మన్ పట్టించుకునే పరిస్థితి లేదని పేద ప్రజలపైన సామాన్యుల పైన మధ్యతరగతి ప్రజల పైన కుటుంబాలని పోషించుకోవడానికి ఫుట్ పాత్ పై డబ్బాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తుంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారి పై ప్రతాపం చూపెడుతూ దౌర్జన్యం చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు.