schedule Saturday, August 01, 2026

19న పరిగిలో హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి:- మారుతి కిరణ్ భూనేటి

calendar_today April 18, 2026
person Prajagalam News
19న పరిగిలో హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి:- మారుతి కిరణ్ భూనేటి
(పరిగి)
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మినీ స్టేడియంలో  ఏప్రిల్ 19, ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే హిందూ సమ్మేళనంకు హిందూ బంధువులు అందరు పెద్ద ఎత్తున హాజరు కావాలని మారుతీ కిరణ్ బునేటి  తెలిపారు  ఈ సందర్బంగా మాట్లాడుతూ హిందూ సమ్మేళనానికి పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి హిందూ బంధువులు పెద్ద ఎత్తున హాజరు కావాలి అని హిందూ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ మరియు సమాజంలో సౌహార్ద వాతావరణాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని  పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత భావన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు.
ప్రతి హిందూ సోదరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.