schedule Friday, July 31, 2026

రైతుల పక్షాన పోరాడిన బీఆర్ఎస్

calendar_today April 19, 2026
person Prajagalam News
రైతుల పక్షాన పోరాడిన బీఆర్ఎస్
 

దిగొచ్చి మొక్క జొన్నలు కొనుగోలు చేసిన ప్రభుత్వం

బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.డి గాయాజ్
వికారాబాద్ -: రైతుల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అని,ఉదయం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని రైతుల కల్లాలను పరిశీలిస్తే,సాయంత్రం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొక్క జొన్నలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎస్.డి గాయాజ్ అన్నారు.కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి కష్టాలు ఉండేవి కావని,నేడు రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.వికారాబాద్ జిల్లా దారుర్ మండలంలోని పలు గ్రామాలలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారని,మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి దృష్టికి తీసుకువచ్చారన్నారు.రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగొచ్చి మొక్క జొన్న కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందన్నారు.మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.