schedule Saturday, August 01, 2026

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

calendar_today April 21, 2026
person Prajagalam News
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి  డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల) రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్‌ లాంటి వ్యాధుల నివారణ కోసం 14,15సంవత్సరాల బాలికలకు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించాలని కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ సూచించారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కస్తూరి భా గాంధీ విద్యాలయంలో చదువుతున్న 18మంది బాలికలకు హెచ్.పీ.వీ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. 15సంవత్సరాల బాలికలు తప్పని సరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని దీంతో గర్భాశయ క్యాన్సర్‌ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య, ఏఎన్ఎం సుజాత, స్టాఫ్ నర్స్ సాజన్,విద్యార్థినులు పాల్గొన్నారు.