schedule Saturday, May 30, 2026

దోమల నివారణతో మలేరియా నియంత్రణ సాధ్యం :- కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

calendar_today April 25, 2026
person Prajagalam News
దోమల నివారణతో మలేరియా నియంత్రణ సాధ్యం  :- కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
(కుల్కచర్ల) పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణతో మలేరియా నియంత్రించవచ్చని కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు.ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని శనివారం కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది కుల్కచర్ల మండల కేంద్రంలోని పలు వీధుల్లో నిర్వహించిన మలేరియా నివారణపై అవగాహన ర్యాలీని డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దోమలు కుట్టడం వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని,వ్యాధి సోకిన వారికి వణుకుతో కూడిన తీవ్రమైన చలి జ్వరం, వాంతులు,చెమటలు పోయుట,తలనొప్పి,ఒళ్లు నొప్పులు లక్షణాలు ఉంటాయన్నారు.ఎవరైనా జ్వరం వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు.అదే విధంగా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వెంకటయ్య,సూపర్వైజర్ విజయలక్ష్మి,ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.