schedule Friday, July 31, 2026

కుల్కచర్ల అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

calendar_today April 25, 2026
person Prajagalam News
కుల్కచర్ల అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ
వికారాబాద్ జిల్లా (కుల్కచర్ల) మే 2న కుల్కచర్ల మండల కేంద్రంలో జరిగే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో కుల్కచర్ల ఉప మండలం హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ దేశానికి హిందూ ధర్మం హిందూ సంస్కృతిని తెలియజేసేందుకు హిందూ సమ్మేళనాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా కుల్కచర్ల మండల కేంద్రంలోని వివేకానంద కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయ రక్షణకు ఏకమవ్వాల్సినసమయం ఏర్పడిందని,హిందూ మతం కాదని హిందూ ధర్మం అని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. హిందూ సమాజం పట్ల గౌరవభావం స్వధర్మం పట్ల అంకితభావం సేవ గుణాలను వికసించడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరుగుతుందని కుల్కచర్ల మండలం వ్యాప్తంగా ఉన్న హిందు బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ హిందూ ధర్మ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ స్వామి ప్రథమేశానంద స్వామిజీ భాగ్యనగర్, ప్రధాన వక్తగా మాన్య శ్రీ యాదగిరి కర్ణాటక, ఒక ప్రముఖ మహిళా వక్త పందెం హైందవి తెలంగాణ ప్రాంత హిందూ సామాజిక వేత్త హాజరుకానున్నారు.