schedule Saturday, May 30, 2026

పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామికి ఇత్తడి పల్లకి బహుకరణ

calendar_today April 28, 2026
person Prajagalam News
పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామికి ఇత్తడి పల్లకి బహుకరణ
(కుల్కచర్ల)వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం పాంబండ శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి రోజు రుద్రాహోమం అనంతరం పల్లకిసేవ నిర్వహించడానికి పొన్నకల్.గ్రామం,అడ్డాకుల్ మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెల్టూరి వారి కుటుంబ సభ్యులు ఇత్తడి పల్లకిని బహుకరించారు. సుమారు 50 (18 కిలోలు ఇత్తడి) వేల వరకు విలువ చేసే పల్లకిని సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం ఈఓ బాలనర్సయ్య సమక్షంలో దేవస్థానానికి అప్పగించారు.ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యలు,దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ కోట్ల.మైహిపాల్ రెడ్డి,అర్చకులు దశరథం,పాండు శర్మ,దేవాలయం సిబ్బంది. భక్తులు తదితరులు పాల్గొన్నారు