30న బండవెల్కిచర్లలో హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి
April 28, 2026
Prajagalam News
(కుల్కచర్ల)ఈ నెల 30వ తేదీ గురువారం సాయంత్రం 5గంటలకు జరిగే హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ బండవెల్కిచర్ల హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ దేశానికి హిందూ ధర్మం హిందూ సంస్కృతిని తెలియజేసేందుకు హిందూ సమ్మేళనాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా బండవెల్కిచర్ల ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు.హిందూ సంస్కృతి సాంప్రదాయ రక్షణకు ఏకమవ్వాల్సిన సమయం ఏర్పడిందని,హిందూ మతం కాదని హిందూ ధర్మం అని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం,హిందూ సమాజం పట్ల గౌరవభావం స్వధర్మం పట్ల అంకితభావం సేవ గుణాలను వికసించడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరుగుతుందని ఈ హిందూ ధర్మ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా వేదపండితులు జనార్దనాచార్యులు,విశిష్ట అథితిగా రాష్ట్ర సాహిత్య పరిషత్ అధ్యక్షులు భాస్కర యోగి,ప్రధాన వక్తగా తెలంగాణ ప్రాంతప్రచార ప్రముఖ్ కట్ట రాజగోపాల్, ప్రముఖ మహిళా వక్త,విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి తూర్పు శ్రీలత రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.బండవెల్కిచర్ల చుట్టూ పక్కల గ్రామాలు,గిరిజన తండాల వ్యాప్తంగా ఉన్న హిందు బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.