schedule Friday, July 31, 2026

ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి :- కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

calendar_today April 29, 2026
person Prajagalam News
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి :- కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్
 (కుల్కచర్ల)
ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, ఆప్తాల్మిక్ అధికారి జవహర్ లాల్ అన్నారు . బుధవారం
జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 54 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 39 మంది శుక్లాల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వారిలో 35 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉందని నిర్ధారించి, మెరుగైన చికిత్స కోసం పుష్పగిరి కంటి ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డా. మాధురి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.