schedule Saturday, May 30, 2026

10వ ఫలితాల్లో సాల్వీడ్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

calendar_today April 30, 2026
person Prajagalam News
10వ ఫలితాల్లో సాల్వీడ్ విద్యార్థుల అద్భుత ప్రతిభ
(కుల్కచర్ల) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 21 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులై శతశాతం ఫలితాన్ని నమోదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కే.రాంచందర్ తెలిపారు. ఈ ఫలితాల్లో బంటారం వర్షిత 533/600 మార్కులతో ప్రథమ స్థానం, యం.ఐశ్వర్య 529/600 మార్కులతో ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు కీర్తి తీసుకువచ్చారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.