schedule Saturday, May 30, 2026

కుల్కచర్లలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

calendar_today May 1, 2026
person Prajagalam News
కుల్కచర్లలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
(కుల్కచర్ల) రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని,దళారులను నమ్మి మోసపోవద్దని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్,మాజీ ఎంపిటిసి సిహెచ్ ఆనందం,కృష్ణారెడ్డి, గోపాల్,గ్రామ సంఘాల అధ్యక్షులు,సిసి,విఓఎలు పాల్గొన్నారు.