schedule Saturday, May 30, 2026

క్షయవ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలి కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

calendar_today May 2, 2026
person Prajagalam News
క్షయవ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలి     కుల్కచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్

(కుల్కచర్ల)క్షఃయ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారని కుల్కచర్ల మండల వైధ్యాధికారి కిరణ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో, ఇప్పాయిపల్లి, పుట్టపహాడ్ గ్రామాల్లో టిబి ముక్త అభియాన్ 100రోజుల కార్యక్రమంలో భాగంగా ఉచిత టిబి వైద్య పరీక్షలు నిర్వహించారు.దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్న 210మందికి ఛాతి ఎక్సరే,వైద్య పరీక్షలు నిర్వహించగా 18మందిని టిబి నిర్దారణ పరీక్షల కోసం పంపించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తుల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల వెయ్యి రూపాయలు జమ చేయడంతో పాటు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిబి సూపర్వైజర్ గోపాల్, టిబి హెల్త్ విజిటర్ రాజు నాయక్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.