schedule Friday, July 31, 2026

ఫారెస్ట్ లో చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవు :-సర్పంచ్ చంద్రభూపాల్, ఏఎంసి చైర్మన్ ఆంజనేయులు

calendar_today May 2, 2026
person Prajagalam News
ఫారెస్ట్ లో చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవు :-సర్పంచ్ చంద్రభూపాల్, ఏఎంసి చైర్మన్ ఆంజనేయులు
(కుల్కచర్ల)
కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామపంచాయతీ  పరిధిలోని దోంగచింత దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న నీలగిరి చెట్లను వివాహ శుభకార్యల అవసర నిమిత్తం నరికితే ఫారెస్ట్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని సర్పంచ్ చంద్రభూపాల్, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు  హెచ్చరించారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలో సర్పంచ్ చంద్రభూపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు లను ఫారెస్ట్ అధికారులు కలిసి దోంగచింత దగ్గర ఫారెస్ట్ లో నీలగిరి చెట్లను చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు నరకడం జరుగుతుందని ఇకపై చెట్లను నరికితే పదివేల రూపాయల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.