శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగ వేడుకలు నిర్వహించాలి.. :- కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్
May 2, 2026
Prajagalam News
(కుల్కచర్ల)
శాంతియుత వాతావరణం లో బక్రీద్ పండుగ వేడుకలు నిర్వహించాలని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతలను కాపాడాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
జంతువుల అక్రమ రవాణా నిషేధమని, గోవులు సహా ఇతర జంతువులను వధ కోసం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా సమయంలో వెటర్నరీ సర్టిఫికేట్, పంచాయతీ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. రైతులు జంతువుల కొనుగోలు, అమ్మకాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అక్రమ రవాణా సమాచారం ఉంటే స్వయంగా చర్యలు తీసుకోకుండా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.