schedule Tuesday, July 28, 2026

ఎస్ఐఆర్ అవగాహన సదస్సు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

calendar_today June 29, 2026
person Prajagalam News
ఎస్ఐఆర్ అవగాహన సదస్సు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరై ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాది ఓటు జూన్ 25వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి అని చెప్పారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు.కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు,చిరునామా మార్పులు చేస్తారు.ఆధార్ కార్డు,ధృవీకరణ పత్రలు సిద్ధంగా ఉంచుకోవాలి, బీఎల్ఓ లకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ షాహెదా బేగం,ఎంపీడీవో సంపత్ కుమార్,బిఎల్ఓ కాన్సెన్సీ కన్వీనర్ కర్ణం పురుషోత్తం రావు,పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి,వైస్ చైర్మన్ చందర్ నాయక్,బషీరాబాద్ గ్రామ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్, మైల్వార్ గ్రామ సర్పంచ్ సీమా సుల్తానా,ఎక్మైయి గ్రామ సర్పంచ్ పి.శశికళ మధు సుధన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైల్వార్ సతీష్, బీఎల్ఓలు,మహిళా సంఘాల నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.